హైదరాబాద్,మేజర్‌న్యూస్: అప్పుల బాధ తాళలేక అన్నదాత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలం కేంద్రంలోని తిర్మ లాపూర్ గ్రామంలో గురువారం చోటుచే సుకుంది. గ్రామానికి చెందిన పాకాల హను మంతు గౌడ్(52) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గత రెండేళ్లుగా పం ట దిగుబడి లేకపోవడంతో పాటు పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు పెరిగి పోవడంతో, పొలం వద్ద ఉన్న చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. హనుమంత్‌గౌడ్ ఆత్మహత్యకు అప్పులే కారణమని పోలీసులు ప్రాధమిక దర్యా ప్తులో తేలింది. అప్పుల బాధతో అన్నదాత ఆత్మహత్య చేసుకోవడంలో తిర్మలా పూర్ గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. మృతుని కుంటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలావుండగా వ్యవ సాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్లిన రైతు కిందికి వేలాడుతున్నవిద్యుత్ తీగ లు తాకి మృతి చెందాడు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మం డలం జిన్నారంలో గురువారం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన రైతు ఈడిగి వెంకటయ్య(55) గురువారం నాడు పొలం వద్ద పని చేస్తుండగా.. ప్రమా దవశాత్తు విద్యుత్ తీగలు తాకి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మృతుడి కుటుంబాన్ని పరామర్శించి రూ.10 వేల ఆర్థిక సాయం అందజేశారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే రైతు మౄఎతి చెందాడని బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa