ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మందుపాతరను నిర్వీర్యం చేసిన పోలీసులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 10, 2017, 01:07 AM

హైదరాబాద్‌,మేజర్‌న్యూస్‌ః జయశంకర్‌ జిల్లా వెంకటాపురం మండలంలోని పాలెంవాగు ప్రాజెక్టుకు వెళ్లే దారిలో కొప్పుగుట్ట వద్ద ఏర్పాటు చేసిన భారీ మందుపాతరను పోలీసులు నిర్వీర్యం చేశారు. ఇటీవల అటవీ ప్రాంతంలో ట్రెంచ్‌లు(కందకాలు) తవ్వేందుకు ఉపాధి హామీ కూలీలు వెళ్లి తిరిగి వచ్చే క్రమ ంలో గమనించిన వారు ఈ నెల 4వ తేదీన పోలీసులకు సమాచారం ఇవ్వ డంతో విషయం బహిర్గతమైంది. అప్పటి నుంచి మందుపాతర తొలగింపులో కొంత జాప్యం జరిగింది. అటవీ ప్రాంతం కావడంతో వ్యూహం ప్రకారమే పోలీ సులు అడుగులు వేశారు. మందుపాతర నిర్వీర్యం విషయం బయటకు పొక్క కుండా పలు జాగ్రత్తలు తీసుకున్నారు. ములుగు ఓఎస్డీ రవీందర్‌, ఏటూరు నాగారం ఏఎస్పీ రాహుల్‌ హెగ్డే, వెంకటాపురం సీఐ రవీందర్‌, ఎసై్స బండారి కుమార్‌ల పర్యవేక్షణలో మందుపాతరను నిర్వీర్యం చేశారు. వరంగల్‌ నుంచి వచ్చిన బాంబ్‌ స్కా్వడ్‌ అధికారులు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచ ేసుకోకుండా పలు జాగ్రత్తలు తీసుకొని నిర్వీర్యం చేశారు. మందుపాతర ఏర్పాటు చేసిన ప్రాంతం మావోయిస్టు ప్రాబల్యం కావడంతో పాటు అటవీ ప్రాంతం లో ఉండటంతో పెద్ద ఎత్తున ప్రత్యేక పోలీసు బలగాలు మోహరించి పహారాగా ఉన్నాయి. గత రెండు రోజుల నుంచి పాలెంవాగు ప్రాజెక్టు సమీ పంలో ఉన్న అటవీ ప్రాంతంలో గ్రేహౌండ్‌‌స బలగాలు కూబింగ్‌ నిర్విహ ంచాయి. ఇదిలావుండగా మందుపాతర ఏర్పాటు చేసిన ప్రాంతంలో రోడ్డు మధ్యలో గొయ్యి తీసి ఉండటం... అక్కడి నుంచి ఎలక్ట్రిక్‌ వైరు బయటకు పెట్టి ఉండటంతో మావోయిస్టులు భారీ మందుపాతర పెట్టి ఉంటారని భావించిన పోలీసు వర్గాలు వరంగల్‌ నుంచి బాంబ్‌స్కా్వడ్‌ నిపుణులను పిలిపించారు. ఎక్‌‌సప్లోజివ్‌ సహాయంతో మందుపాతరను బాంబ్‌స్కా్వడ్‌ నిపుణులు పేల్చివేశారు. దీంతో మందుపాతర నిర్వీర్యం చేసిన చోట వృత్తంగా(చుట్టూ) 6 అడుగుల వెడల్పు, లోతు 3నుంచి 4 అడుగుల మేర గొయ్యి పడింది. స్టీల్‌ బాక్‌‌సలో ఏర్పాటు చేసిన మందుపాతరలో 4నుంచి 5కిలోల ప్రమాదకరమైన పేలుడు పదార్థాలు ఉంచినట్లు తెలిసింది. నిర్వీర్యం విషయం గోప్యంగా ఉంచడంతో పేలుడు సమయంలో బయటపడిన పదార్థాలు ఆ ప్రాంతంలో కనపడకుండా పోలీసులు పలు జాగ్రత్తలు తీసుకున్నారు. పేలుడు దాటికి మాత్రం బండరాళ్లు తునాతునకలైన సంఘటన ప్రాంతంలో కనపడుతుంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa