-తెలంగాణ రాజకీయాల నుండి రేణుకా ఔట్
-ఖమ్మం కాంగ్రెస్‌ను కనుసైగలతో శాసించిన చౌదరి
-పాలేరు ఉప ఎన్నికల ప్రచారానికి దూరం
-ఖమ్మం పార్లమెంటు నుండి మూడు సార్లు పోటీ
-గత ఎన్నికలలో టికెటివ్వని కాంగ్రెస్ అధిష్ఠానం
-సోనియా కోటరీలో కీలక నేతగా ఎదిగిన మహిళా నేత
-రాజ్యసభ ఎంపిగా ఢిల్లీ రాజకీయాలకే పరిమితం
మేజర్‌న్యూస్ తెలంగాణ ప్రతినిధిః సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ రాజకీయాలలో కీలక నేతగా ఉంటూ ఆ పార్టీ నిర్ణయాలలో కీలక భూమిక పోషించిన సీనియర్ నేత ఫైర్‌బ్రాండ్ రేణుకా చౌదరి ఇపుడు రాష్ట్ర రాజకీయాల నుండి కనుమరుగయ్యారు. సోనియా గాంధీ కోటరీలో కీలక నేత గా ఉన్న ఆమెకు 2009 సార్వత్రిక ఎన్నికలలో ఓటమి పాలయినప్పటకి రాజ్య సభ సీటును కట్టబెట్టింది అధిష్ఠానం. గడిచిన పది సంవత్సరాలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ కాలంలో రాష్ట్రంలో ఎవరు ముఖ్య మంత్రిగా ఉన్న ఖమ్మం జిల్లా వరకు మాత్రం రేణుకా చౌదరి హవానే కొనసా గేది. నేరుగా ఢి ల్లీ పెద్దల ద్వారా పార్టీలో తనను నమ్ముకున్న వారికి న్యాయం చేసేందుకు ఆమె తీవ్రంగా ప్రయత్నించే వారు. జిల్లాలోని పది అసెంబ్లీ నియో జకవర్గాలలో కనీసం ఐదు స్థానాలలో తను చెప్పిన వారికే పార్టీ టికెట్లు వచ్చేవి అంటే ఆమె హవా ఎలా కొనసాగేదో అర్థం చేసుకోవచ్చు. యుపిఏ తొలి క్యాబిన ెట్‌లో ఆమె కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. రాహుల్ గాంధీతో పాటు మన్మోహన్ సింగ్ పైన ఆమె ఈగ వాలనిచ్చే వారు కాదు. పార్లమె ంట్‌లోను తన ప్రసంగంతో పలుమార్లు ఆకట్టుకున్నారు. రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన చౌదరి తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు. ఆ సందర్బంలో తెలంగాణ వాదుల ఆగ్రహనికి గురయ్యారు. పార్టీ అధిష్ఠానం రాషా్టన్న్రి విభజించాలని తీసుకున్న నిర్ణయంతో ఆమె సైలంట్ అయ్యారు. గత సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ, సిపిఐ ఎన్నికలలో కలసి పోటీచేశాయి. ఉమ్మడి అభ్యర్థిగా అప్పటి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ నారాయణ పోటీ చేయ డంతో ఆమె దూరంగా ఉన్నారు. ఆ ఎన్నికలలో కాంగ్రెస్ కేంద్రంలో , రాష్ట్రంలోను అధికారం కోల్పోవడం రేణుకా తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. అప్పటి నుండి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు దూరంగా ఉంటూ ఢిల్లీ రాజకీయాలకే ఆమె పరిమితమవుతూ వస్తున్నారు.
ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్న చౌదరి
కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్‌రెడ్డి అకాల మరణం చెందడంతో జిల్లాలోని పాలేరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు అనివార్య మయ్యా యి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోరాడింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క, పిసిసి చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి తదితరులు ప్రచారంలో కీలక భూమిక పోషించారు. పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం ఖమ్మం పార్లమెంటు పరిదిలోకి వస్తుంది. ఆమెకు ఆ నియోజ కవర్గంలో విస్తృతమైన సంబందాలు ఉన్నాయి. రేణుకను ప్రచారంలో పాల్గొ నాలని కాంగ్రెస్ శ్రేణులు కోరినప్పటికి ఆమె మాత్రం ఢిల్లీలోనే ఉండిపోయారు. గ్రేటర్ హైదరాబాద్ కార్పోరేషన్ ఎన్నికల ప్రచారంలోను పాల్గొనలేదు. వరంగల్ పార్లమెంటు ఉప ఎన్నిక, కార్పోరేషన్ ఎన్నికలలో సైలంట్‌గా ఉండిపోయారు. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ తరుపున నిర్వహించే కార్యక్రమాలకు కూడ దూరం గా ఉంటున్నారు. తెలంగాణలో పార్టీ కష్టకాలంలో ఉన్న కూడ ఆమె పార్టీ నేతలకు దూరంగా ఉండడంపై టికాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఎన్నికలపుడే ఢిల్లీలో చక్రం తిప్పడం పార్టీ టికెట్ తెచ్చుకుని పోటీ చేయడం సీనియర్ నేతలకు అలవాటుగా మారిందనే విమర్శలు వ్యక్తం అవుతు న్నాయి. కాంగ్రెస్ పార్టీ తరుపున తెలంగాణ నుండి రాజ్యసభ ఎంపిగా కొనసా గుతున్నప్పటికి స్థానిక కాంగ్రెస్‌నేతలకు మాత్రం అందుబాటులో ఉండడం లేదు. జాతీయ నేతగా ఆమె ఢిల్లీలో పార్టీ తరుపున కార్యక్రమాలకు మాత్రమే హజరవుతున్నారు.
సోనియా కోటరీలో కీలక నేతగా మారిన రేణుకా చౌదరి
ఖమ్మం జిల్లాలో ఆమెకు నలుగురైదుగురు ప్రధాన అనుచరులు ఉన్నారు. వారిలో యూనిస్ సుల్తాన్ వంటి వారు పార్టీ మారగా, మిగిలిన నేతలు స్థబ్దుగా ఉన్నారు. తనను తాను జాతీయ నేతగా అభివర్ణించుకున్న రేణుకా ఏఐసిసిలో కీలకమైన పదవిలో కొనసాగుతున్నారు. పార్టీ అధికార ప్రతినిధిగా ఆమె బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 1999 నుండి 2004 వరకు ఎంపిగా కొనసాగిన సందర్బంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో ఆమెకు సన్నిహిత సంబందాలు ఏర్పడ్డాయి. మహిళా నాయకులకు రాజకీయ అవకాశాలు కల్పిస్తూ ప్రోత్సహించే సోనియా గాంధీ రేణుకకు కూడ పార్టీలో సమున్నత గౌరవాన్ని ఇచ్చారు. రాష్ట్రంలో పార్టీని కాపాడే బాధ్యతను ఆమెకు అప్పగించినప్పటికి ఆమె మాత్రం గల్లీ రాజకీయాలను వదిలి ఢిల్లీ రాజకీయాల వైపే మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి భట్టి విక్రమార్క రూపంలో ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్నారు. గత ఎన్నికలలో మూడు అసెంబ్లీ స్థానాలను గెలుచుకుని పరువాలేదనిపించిన కాంగ్రెస్ పార్టీ అనతి కాలంలోనే తన వైభవాన్ని కోల్పోయింది. పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే మరణించగా మరో ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ పార్టీ మారారు. జిల్లాలోని పది నియోజకవర్గాలలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు కూడ ఎస్ సి, ఎస్టీలకు రిజర్‌వ అయ్యాయి. ఆయా నియోజకవర్గాలకు చెందిన ఇంఛార్జీలు పార్టీని కాపాడలేక చేతులెత్తేశారు. ఈ నేపద్యంలో వారందరికి భరోసా ఇస్తూ అండగా ఉండాల్సిన రేణుకా జిల్లారాజకీయాలను పట్టించుకోవడం లేదు. రాబోయే ఎన్నికల నాటికి కూడ ఆమె ఖమ్మం పార్లమెంటు నుండి పోటీ చేసే పరిస్థితులు లేవని కాంగ్రెస్ క్యాడర్ అనుమానిస్తున్నారు. 2018 వరకు ఆమెకు రాజ్యసభ పదవి ఉంటుంది. అయితే రేణుకా చౌదరి అభిమానులు మాత్రం ఆమె జిల్లా రాజకీయాలను వదిలే ప్రసక్తే లేదని ఖచ్చితంగా తిరిగా ఖమ్మం జిల్లా పాలిటిక్‌స పై ఆమె దృష్టి పెడతారని వ్యాఖ్యానిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa