తెలంగాణలో జరగనున్న ఎన్నికల నేపధ్యంలో రాష్ట్రంలోని విద్యాసంస్థలకు 6,7న సెలవులు ప్రకటించారు. ఈ సెలవులు ముగియడంతో రెండో శనివారం, ఆదివారం రానుండటంతో వరుసగా నాలుగురోజులు సెలవులు రానున్నాయి. ఇతర ప్రభుత్వ సంస్థలకు కూడా మూడు రోజులు సెలవులు రానున్నాయి. ఈనెల 7న జరగనున్న ఎన్నికలను పురస్కరించుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు ప్రకటించారు. తరువాతి రోజు రెండో శనివారం, ఆదివారం రావడంతో మూడు రోజులు సెలవులు వస్తున్నాయి. ఓట్ల కౌంటింగ్ రోజైన మంగళవారం నాడు కూడా విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు.