ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ ఎల్పీ సమావేశం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 11, 2019, 01:46 PM

హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష సమావేశం ప్రారంభమైంది. ఎమ్మెల్సీ ఎన్నికలపై ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. రేపు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఎమ్మెల్సీ ఎన్నికలపై ఎమ్మెల్యేలకు మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ అభ్యర్థులు మహమూద్ అలీ, షేరి సుభాష్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎగ్గె మల్లేషం, ఎంఐఎం ఎమ్మెల్సీ అభ్యర్థి మీర్జా రియాజ్ ఉల్ హాజరయ్యారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com