ఐదేళ్లలో నల్లధనం వెనక్కి రాలేదని, ఉద్యోగాలు రాలేదని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. ఈరోజిక్కడ ఆయన మాట్లాడుతూ బీజేపీపై విమర్శలు చేశారు. నీరవ్ మోడీ లాంటి వాళ్లను మాత్రం దేశం విడిచిపోయేలా చేశారని విమర్శించారు. మోడీ ప్రభుత్వానికి దొరకని నీరవ్ మోడీ… మీడియాకు దొరికాడని ఎద్దేవా చేశారు. సైనికుల త్యాగాల్ని కూడా మోడీ తన ఖాతాలో వేసుకుంటున్నారని విమర్శించారు.