మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఇంటికి గురువారం ఉదయం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి వెళ్లారు. ఆమెతో పాటు ఆమె కుమారుడు కార్తీక్ కూడా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి తన కుమారుడు కార్తీక్ టికెట్ ఇవ్వలేదనే అసంతృప్తిలో సబితా ఉన్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఆమె నిన్న కేసీఆర్తో కూడా భేటీ అయ్యారు.