ట్రెండింగ్
Epaper    English    தமிழ்

Nukarapu Surya Prakasa Rao | తెలుగురాష్ట్రాల‌లో అసెంబ్లీ సీట్ల పెంపుపై సూర్య అధినేత అభిప్రాయం

mukha mukhi |  Suryaa Desk  | Published : Fri, Jul 26, 2019, 11:01 AM

విభ‌జ‌న చ‌ట్టంలో ఇచ్చిన హామీ మేర‌కు ఇరు తెలుగు రాష్ట్రాల‌లో అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్రం విస్ప‌ష్టం నిర్ణ‌యం తీసుకోవ‌టం లేదు. తమ రాష్ట్రాల్లో శాసనసభ సీట్లను పెంచాలని కోరుతూ గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్‌లు కేంద్రాన్ని కోరినా కాదు కూడ‌దంటూ చెప్పిన బిజెపిప్ర‌భుత్వం ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రినామాల‌ను దృష్టిలో ఉంచుకుని పెంపుకు సిద్ద‌మ‌వుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. మీరేమంటారు. - పి. చంద్రజీవ‌న్‌, విశాఖ‌ప‌ట్నం


మీర‌న్న‌ది నిజ‌మే జీవ‌న్‌గారూ! తెలుగు రాష్ట్రాల‌లో అసెంబ్లీ సీట్ల పెంపుపై విభ‌జ‌న చ‌ట్ట ప్ర‌కారం నిర్న‌యం తీసుకోవాల్సి ఉన్నా కేంద్ర నానుస్తూ వ‌చ్చిన మాట వాస్త‌వం. ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌, సిక్కిం రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్రం కసరత్తు చేస్తోంది. వీటితోపాటు ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్ల పెంపు అంశాన్నికూడా చేపట్టే ఉద్దేశంతో ఏప్రిల్‌లో కేబినెట్‌ నోట్‌ తయారుచేసి ఈసీకి పంపిందేమోనన్న‌ది  రాజకీయ వర్గాల  అనుమానం.  ఏపీ విభజన చట్టం సెక్షన్‌ 26 ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రతి పార్లమెంటు స్థానం పరిధిలో రెండు అసెంబ్లీ స్థానాలను పెంచాల్సి ఉంది. దీని ప్రకారం ఏపీలో 50, తెలంగాణలో 34 అసెంబ్లీ సీట్లు పెరగాలి. అయితే ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 170కి లోబడే జరగాలనే నిబంధనను అందులో పొందుపరిచారు. సంక్లిష్టతతో కూడుకున్న కావడంతో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకపోయింది. దీంతో ఇది ముగిసిన అధ్యాయమే అనుకున్నారు. అయితే, 2019 సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన తర్వాత ఏప్రిల్‌లో సీట్ల పెంపుపై ఈసీకి కేంద్ర ప్రభుత్వం కేబినెట్‌ నోట్‌ పంపింది. ఆ విషయాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది.   దేశంలో పదేళ్లకోసారి జరిగే జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. దీనికి రాష్ట్రపతి అనుమతి తప్పనిసరి. ప్రతి జనాభా లెక్కల తర్వాత నియోజకవర్గ పునర్విభజనకు చట్టం చేసే అవకాశాన్ని రాజ్యాంగంలోని 82వ అధికరణం పార్లమెంటుకు ఇస్తోంది. ఈ చట్టం ఆమోదించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజనకు ఓ కమిషన్‌ ఏర్పాటు చేస్తుంది. ప్రస్తుతం 2026 వరకు నియోజకవర్గాల పునర్విభజన కుదరదు. ఒకవేళ ప్ర‌త్యేక క‌స‌ర‌త్తుతో అసెంబ్లీ స్థానాలను పెంచితే ఏపీలో ప్రస్తుతం 175 ఉండగా అవి 225కి, తెలంగాణలో 119 నుంచి 153కు చేరుతాయి 


Nukarapu Surya Prakasa Rao


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com