ప్రముఖ నటుడిగా జీవించి, దర్శకుడిగా, నట శిక్షకుడిగా ఎన్నో మన్ననలు పొందిన దేవదాస్ కనకాల నేడు స్వర్గస్తులైయ్యారు. నాటక దర్శకత్వం నుంచి సినిమా దర్శకునిగా ఎదిగారాయన. దేవదాస్ కనకాల 1945లో జులై 30న యానాంలో జన్మించారు. దేవదాసు స్వగ్రామం యానాం శివారులోని కనకాల పేట. తండ్రి కనకాల తాతయ్య నాయుడు యానాం ఫ్రెంచి పరిపాలనలో ఉన్నప్పుడు యానాం ఎమ్మెల్యేగా పనిచేశారు. తల్లి మహ లక్షమమ్మ. ఆయన మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.