బ్రెయిన్ డెడ్ అయిన ఒక వ్యక్తి గుండెను మరొక రోగికి అమర్చడానికి వీలుగా ట్రాఫిక్ పోలీసులు నగరంలో గ్రీన్ కారిడార్‌ను ఏర్పాటు చేశారు. సికిందరాబాద్ యశోదా ఆసుపత్రిలో బ్రెయిన్ డెడ్‌కు గురైన వ్యక్తి గుండెను నాంపల్లిలోని కేర్ ఆసుపత్రిలో మరొక రోగికి అమర్చనున్నారు. దీనికోసం ఆ ప్రాంతంలో గ్రీన్ కారిడార్‌ను ఏర్పాటు చేశారు. సికిందరాబాద్ యశోదా ఆసుపత్రినుంచి నాంపల్లి కేర్ ఆసుపత్రి వరకూ కొద్దిసేపు ట్రాఫిక్‌ను నిలిపివేయనున్నారు.