సిద్దిపేట జిల్లాలోని కోహెడ మండలం బస్వాపూర్ గ్రామంలో మంత్రులు శ్రీనివాస్ గౌడ్, హరీష్‌రావు, ఎమ్మెల్యే సతీష్ కుమార్ పర్యటించారు. పర్యటనలో భాగంగా సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని మంత్రులు ఆవిష్కరించారు. పాపన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు మంత్రులు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. బహుజనుల కోసం ఆనాడే పాపన్న పోరాడారని గుర్తు చేశారు. అందరినీ కలుపుకుపోయి కులవృత్తులను కాపాడిన చరిత్ర పాపన్నది. అంతరించిపోతున్న కులవృత్తులకు సీఎం కేసీఆర్ నేడు పూర్వ వైభవం తీసుకువస్తున్నారు. ఒకప్పుడు హైదరాబాద్‌లో కల్లు నిషేధం ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కేసీఆర్ సీఎం అయ్యాక కల్లు దుకాణాలను తెరిపించారు. ఆరోగ్య ప్రదాయినిగా భావించే నీరా అమ్మకాలకు సీఎం కేసీఆర్ పచ్చజెండా ఊపారని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. నీరాను సేవించడం వల్ల అనారోగ్యాలు దరిచేరవని మంత్రి పేర్కొన్నారు.