చెన్నూరు నియోజకవర్గంలోని మందమర్రి మండలంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ పర్యటించారు. ఆదిల్పేట్ గ్రామంలో సీఎస్ఆర్ నిధులతో చేపట్టబోయే డ్రైనేజీ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఆదిల్పేట, వెంకటాపూర్ గ్రామాల్లో వైకుంఠ ధామం, డంపింగ్ యార్డు నిర్మాణ పనులకు కూడా బాల్క సుమన్ శంకుస్థాపన చేశారు. అంతకుముందు చెన్నూరు పట్టణంలో టీఆర్ఎస్ యూత్ వింగ్ కార్యకర్తలతో సుమన్ భేటీ అయ్యారు. నవంబర్ 27న నిర్వహించబోయే టీఆర్ఎస్ యూత్ వింగ్ సమావేశ ఏర్పాట్లపై చర్చించి దిశానిర్దేశం చేశారు.