వనపర్తి జిల్లాలోని పెద్దమందడి మండల పరిధిలోని పలు గ్రామాల్లో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పర్యటించారు. మణిగిల్ల, అల్వాల, చిన్నమందడి, దొడగుంటపల్లి, వీరాయపల్లి గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గ్రేడ్ ఎ రకానికి రూ. 1835గా, కామన్ రకానికి రూ.1815గా నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. మార్కెట్‌యార్డుకు వరి ధాన్యం తీసుకువచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని మార్కెట్ కమిటీలకు సూచించారు.