ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐదేళ్లలో గణనీయమైన పారిశ్రామిక ప్రగతి : మంత్రి కెటిఆర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 20, 2019, 06:16 AM

పారిశ్రామిక రంగంలో పెట్టుబడులకు తెలంగాణ స్వర్గదామమని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. సింగపూర్ కా న్సుల్ జనరల్ పొంగ్ కాక్ టిఎన్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం మంగళవారం మసబ్‌ట్యాంక్‌లోని పురపాలక శాఖ కార్యాలయంలో మంత్రి కె టిఆర్ సమావేశమైంది. ఈ సందర్భంగా సింగపూ ర్, తెలంగాణ మధ్య మరింత బలమైన వ్యాపార వాణిజ్య సంబంధాలను నెలకొల్పేందుకు అవసరమైన అంశాలపైన చర్చించారు. ఇప్పటికే తెలంగాణలో అనేక కంపెనీలు, సంస్థలు కార్యకలాపాలను విజయవంతంగా కొనసాగిస్తున్నాయని మం త్రి కెటిఆర్ కాన్సుల్ జనరల్‌కు వివరించారు. అ లాగే పలు రంగాల్లో సింగపూర్ అనుభవాలను మ రింతగా ఉపయోగించుకుంటామని మంత్రి కెటిఆర్ అన్నారు. ఐటిలో శిక్షణ, ఫార్మ, అర్బన్ ఇ న్ఫ్రాస్ట్రక్చర్, టూరిజం వంటి రంగాల్లో సింగపూర్ గణనీయమైన ప్రగతి సాధించిందని ఈ రంగాల్లో తెలంగాణకు పూర్తి సహకారం అందిస్తామని కా న్సుల్ జనరల్ ప్రతిపాదించారు. తెలంగాణ ప్రభు త్వం ప్రపంచంలోనే అతిపెద్ద ఏకీకృత ఫార్మా క్లస్ట ర్ ను ఏర్పాటు చేస్తున్నదని, ఈ ఫార్మాసిటీ కోసం సింగపూర్ కు చెందిన సుర్బాన జరొంగ్ మాస్టర్ ప్లానింగ్ చేస్తున్నాదని మంత్రి తెలిపారు. కాలుష్య రహితంగా ఫార్మాసిటి ఉండాలన్నదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని, ఈ మేరకు సింగపూర్ లాం టి దేశాల అనుభవాన్ని ఉపయోగించుకుంటామని తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత గత ఐదు సంవత్సరాల్లో గణనీయమైన పారిశ్రామిక ప్రగతి సాధించిందని, అనేక ప్రపంచ ప్రఖ్యాత పెట్టుబడులు తెలంగాణకు తరలి వచ్చాయన్నారు. ఇందుకు ప్రధాన కారణం తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక విధానమని మంత్రి కెటిఆర్ తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన టిఎస్-ఐపాస్ దేశంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానాల్లో ఒకటని తెలిపారు. దీంతోపాటు దేశంలోనే అత్యుత్తమ నగరాల్లో హైదరాబాద్ ఒకటిగా నిలుస్తూ వస్తున్నదన్నారు. ఇలాంటి చోట పెట్టుబడులు పెట్టేందుకు విదేశాల నుంచి అనేక కంపెనీలు ముందుకు వస్తున్నాయని కాన్సుల్ జనరల్ కు తెలిపిన మంత్రి సింగపూర్ నుంచి పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే కంపెనీలకు పూర్తి సహకారం అందిస్తామన్నారు. ఈ మేరకు తెలంగాణలోని పెట్టుబడుల అవకాశాలను వివరించేందుకు సింగపూర్ కంపెనీలతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న మౌళిక వసతులను ఇక్కడి ఇకో సిస్టంని పరిశీలించేందుకు స్థానిక ఐటిపార్కులు,టి-హబ్ వంటి ప్రాంతాలను సందర్శించాలని కాన్సుల్ జనరల్‌ను మంత్రి కోరారు.
వచ్చే సంవత్సరం జరుగనున్న బయో ఏషియా సదస్సుకి సింగపూర్‌లోని ఫార్మ దిగ్గజాలను భాగస్వాములను చేసేందుకు కాన్సుల్ కార్యాలయం సహకరించాలని కోరారు. ఈ సమావేశం ద్వారా తెలంగాణ ప్రభుత్వ పాలసీలు ప్రాధాన్యతల పట్ల మరింత స్పష్టత వచ్చిందని తెలిపిన కాన్సుల్ జనరల్, ఇక్కడి ప్రభుత్వ విధానాలను ప్రశంసించారు. ఇక్కడి ప్రభుత్వ నాయకత్వాన్ని చూశాక సింగపూర్ లాంటి దేశాలకు చెందిన కంపెనీలు స్వేచ్ఛగా పెట్టుబడి పెట్టేందుకు ప్రోత్సాహంగా ఉంటుందని, ఈ మేరకు సింగపూర్ పారిశ్రామిక వర్గాల్లో తెలంగాణ గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తామని మంత్రి కెటిఆర్‌కు హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో పరిశ్రమలు మరియు ఐటి శాఖ ముఖ్య కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com