స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ -2019 అవార్డుకు తెలంగాణ ఎంపికైంది. ఢిల్లీలో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డును తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అందుకోనున్నారు. రాష్ట్రంలో హరితహారం కింద మొక్కల పెంపకం విస్తృతంగా కొనసాగుతోంది. అంతేకాదు గ్రామీణ ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచేందుకు 30 రోజుల ప్రణాళికతో ప్రభుత్వం పలు కార్యక్రమాలను చేపట్టింది. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ప్రభుత్వం పలు కార్యక్రమాలను కూడా నిర్వహించింది. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే అంటు రోగాలు ప్రబలవన్న అంశంపై కూడా ప్రభుత్వం ప్రజల్లో అవగాహన కలిపించింది.