రాష్ట్రంలో బస్సు రూట్లను ప్రైవేటీకరిస్తూ క్యాబినెట్ చేసిన తీర్మానాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. పిటిషనర్ తరపు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలను విన్న అనంతరం హైకోర్టు స్పందిస్తూ మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 67 ప్రకారం రోడ్డు రవాణా రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుందని హైకోర్టు పేర్కొంది. ఆర్‌టిసి, ప్రైవేటు వ్యవస్థలు సమాంతరంగా నిర్వహి ంచే అధికారం ప్రభుత్వానికి ఉన్నప్పుడు కేబినెట్ నిర్ణయం త ప్పెలా అవుతుందో చెప్పాలని పిటిషనర్ తరఫు న్యాయవాదిని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. అయితే సెక్షన్ 102 ప్రకా రం ఎలాంటి మార్పులు చేసినా ఆర్‌టిసికి సమాచారం ఇవ్వాల ని పిటిషనర్ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ కోర్టుకు వివరించారు. ఆర్‌టిసికి ఎలాంటి నష్టం జరగదని గతంలో సిఎం అన్న వ్యాఖ్యలను కోర్టుకు ఉదహరించారు. దీనికి స్పందించిన ధర్మాసనం సిఎం ఏమి అన్నారన్నది న్యాయస్థానానికి సంబం ధం లేదని స్పష్టం చేసింది. కేబినెట్ నిర్ణయం చట్ట బద్ధమా? చట్ట విరుద్ధమా? అనేది కోర్టు ముందున్న అంశం అని ధర్మాసనం పేర్కొంది. చట్టం ప్రకారం ప్రతిపాదిత మార్పులను గెజిట్‌లో ప్రచురించాలని, ప్రతిపాదిత మార్పులు స్థానిక దిన పత్రికల్లో ప్ర చురించాలని, అభ్యంతరాలు స్వీకరించేందుకు 30 రోజుల సమ యం ఇవ్వాలని హైకోర్టు పేర్కొంది. అయితే చట్ట పరమైన ప్రక్రి య అనుసరించారో లేదో అని తెలియకుండా ఇప్పుడే రూట్ల ప్రైవేటీకరణ చట్ట విరుద్ధమని ఎలా అంటామని హైకోర్టు ప్రశ్నించింది. రవాణా రంగంలో ప్రైవేటీకరణ చేయవద్దని ఏ చట్టమైనా చెబుతోందా? అని హైకోర్టు ప్రశ్నించింది. రవాణా రంగంలో ప్రైవేటీకరణ చేయవద్దని ఏ చట్టమైనా చెబుతోందా? అని మరోసారి ప్రశ్నించింది. వాదనల స్వీకరించి గెజిట్ వెలువరించాలని, ఆ తర్వాత జివొ జారీ చేస్తేనే క్యాబినెట్ అమల్లోకి వస్తుందని, అప్పటి వరకూ ఆ నిర్ణయాన్ని సవాల్చేయడం చెల్లదని, పిటిషన్‌ను డిస్మిస్ చేయాలని కౌంటర్ పిటిషన్‌లో హైకోర్టును కోరారు.
రాష్ట్ర ప్రభుత్వఅధీనంలో ప్రజారవాణా వ్యవస్థ రాష్ట్రంలో ఆర్‌టిసి, ప్రైవేటు రవాణా వ్యవస్థలను సమాంతరంగా నిర్వహించే అధికారం ప్రభుత్వానికి ఉన్నప్పుడు, రూట్ల ప్రైవే టీకర ణపై మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయం ఏ విధంగా తప్పవు తుందని న్యాయస్థానం ప్రశ్నించింది. మోటారు వెహికిల్ యాక్ట్ సెక్షన్-67 ను అనుసరించి ప్రజా రవాణా వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వ అధీ నంలో ఉంటుందని స్పష్టం చేసింది. రవాణా వ్యవస్థను ప్రైవేటీకరణ చేయ రాదని ఏ చట్టమైనా చెబుతోందా? అంటూ ప్రశ్నించింది. అయితే, ప్రైవేటీకరణ ప్రక్రియలో చట్టపరంగా వెళతారా? లేదా? అనే అంశంపై స్పష్టత లేనప్పుడు, తాము ఎలాంటి నిర్ణయం ప్రకటించలేమని హైకోర్టు తేల్చిచెప్పింది.
ఎయిర్‌లైన్స్ విజయవంతం
గతంలో దేశంలో ఇండియన్ ఎయిర్ లైన్స్ మాత్రమే ఉండేదని, కాల క్రమంలో చాలా ప్రైవేటు ఎయిర్‌లైన్స్ విజయవంతమయ్యాయని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ప్రభుత్వం చట్ట పరమైన ప్రక్రియ అనుసరిస్తుందా లేదా అనేది తెలియకుండా ఇప్పుడే చట్ట విరుద్ధమని ఎలా ప్రకటిస్తామని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. సెక్షన్ 102 ప్రకారం ప్రభుత్వం అనుసరించాల్సిన ప్రక్రియ ఏంటో వివరించాలని పిటిషనర్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచిం చింది. అనంతరం హైకోర్టు స్పందిస్తూ రవాణా రంగంలో ప్రైవేటీక రణ చేయొద్దని ఏ చట్టమైనా చెబుతోందా? అని ప్రశ్నించింది. ప్రపం చం గ్లోబలైజేషన్ క్యాపిటలైజేషన్ కాలంలో ఉందని పేర్కొంది. ఈ సందర్బంగా ఒకప్పుడు ఇండియన్ ఎయిర్ లైన్స్ మాత్రమే ఉండేద ని, తరువాత ప్రైవేటు ఎయిర్ లైన్స్ విజయవంతమ య్యాయని న్యాయస్థానం వివరించింది.