లేబర్ కోర్టు తీర్పు వెలువడే వరకూ ఆర్టీసీ సమ్మె కొనసాగుతుందని ఆర్టీసీ జాక్ కన్వీనర్ అశ్వథామరెడ్డి చెప్పారు.. కార్మిక సంఘాలనేతలు, అఖిల పక్ష నేతలతో ఈరోజు ఆర్టీసీ జాక్ సమ్మెపై సుదీర్ఘంగా చర్చించింది.. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, హైకోర్టు తీర్పు కాపీ ఇంకా తమకు అందలేదని, అది అందిన తర్వాత న్యాయ నిపుణులతో చర్చిస్తామని అన్నారు.. సమ్మె విషయం లేబర్ కమిషనర్ కార్యాలయానికి చేరడంతో అక్కడ నుంచి తీర్పు వెలువడే వరకూ సమ్మె కొనసాగుతుందని అన్నారు.