ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ సప్లమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. యూనివర్సిటీ పరిధిలో నిర్వహించిన బీఎస్సీ, బీఏ, బీకామ్, బీబీఏ గ్రూపుల పరీక్ష ఫలితాలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తమ హాల్టికెట్ నెంబరు నమోదుచేసి ఫలితాలను పొందవచ్చు. ఫలితాలను ఓయూ వెబ్ సైట్ www.osmania.ac.inలో అందుబాటులో ఉంచినట్లు చెప్పారు.