ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భర్తను ప్రియుడితో కలిసి కడతేర్చిన భార్య

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 25, 2020, 06:14 PM

ఈనెల 15న నల్గొండ జిల్లా, గాగిల్లాపూర్ వద్ద జరిగిన యదగౌడ్ హత్య కేసును దుండిగల్ పోలీసులు ఛేదించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... యాదగౌడ్ భార్య సౌజన్యకు ఆసిఫ్ అనే వ్యక్తితో అక్రమ సంబంధాలు ఉన్నాయి. దీంతో భార్య సౌజన్యను యదగౌడ్ తరచు వేధిస్తూ ఉండేవాడు. దీంతో పాటు ఆసీఫ్ ను మందలించడంతో కోపం పెంచుకున్న ఆసీఫ్ యాదగౌడ్ ను చంపేందుకు ప్లాన్ వేశాడు. ప్లాన్ ప్రకారం గగిల్లపూర్ డబుల్ బెడ్ రూళ్ల ఇళ్ల నిర్మాణం వద్ద యాదగౌడ్ కు ఆసిఫ్ మద్యం తాగించాడు. అనంతరం కత్తితో పొడిచి హత్య చేశాడు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తను ప్రియుడితొ కలిసి కడతేర్చింది భార్యను, ప్రియుడు ఆసిఫ్ ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com