ఈ సంవత్సరం ప్రారంభం నుండి పెట్రోల్ ధర రూ. 4 మరియు డీజిల్ ధర రూ.4.15 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఇక పోతే గత రెండు రోజులుగా తగ్గుతూ వస్తోన్న పెట్రోల్ ధరలు శుక్రవారం కూడా తగ్గాయి. పెట్రోల్ ధర 16 పైసలు, డీజిల్ ధర 15 పైసలు చొప్పున తగ్గింది. దీంతో హైదరాబాద్‌లో శుక్రవారం లీటరు పెట్రోల్ ధర రూ.75.62కు, డీజిల్ ధర రూ.69.47కు తగ్గింది. అమరావతిలో కూడా పెట్రోల్ ధర 16 పైసలు తగ్గుదలతో రూ.76.20కు చేరింది. డీజిల్ ధర కూడా 14 పైసలు తగ్గడంతో రూ.70.11కు తగ్గింది. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర 15 పైసలు తగ్గుదలతో రూ.71.14కు చేరుకుంది. డీజిల్ ధర కూడా 13 పైసలు తగ్గడంతో రూ.63.81కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 0.94శాతం తగ్గుదలతో 49.58 డాలర్లకు తగ్గిపోయింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 0.81 శాతం తగ్గడంతో 45.55 డాలర్లకు దిగొచ్చింది.