ధోని గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అతను ఎటువంటి నాయకుడో అటువంటి ఆటగాడో అందరికి తెలుసు. అయితే చివరగా 2019 లో జరిగిన వరల్డ్ కప్ తరువాత భారత తుది జట్టు లో స్థానం కోల్పోయాడు ధోని. అయితే ఇన్ని రోజుల తరువాత ఇప్పుడు ఐపీఎల్ సందర్బంగా మళ్ళీ బ్యాట్ పటుకుంటున్నాడు. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు కెప్టెన్ గా ఉన్న ధోని ప్రాక్టీస్ కోసం ఎప్పుడో చెన్నై చేరుకున్నాడు. అయితే నిన్న నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్న ధోని వరుసగా 5 బంతుల్లో 5 సిక్స్‌లు బాదేశాడు. దీనికి సంబంధించిన వీడియో ను స్టార్ స్పోర్స్ట్ తమిళ్ తమ అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసి అభిమానులతో పంచుకుంది. అయితే వీడియో వచ్చిన కొద్దీ సేపట్లోనే వైరల్ గా మారింది. ఈ వీడియోలో ధోనీ వెనక సురేష్ రైనా, పీయుష్ చావ్లా ఉన్నారు. అయితే ధోని బ్యాటింగ్ చూసి ఈ సారి మళ్ళీ కప్ 'సి ఎస్ కె' నే కొడుతుంది అంటున్నారు అభిమానులు. అయితే ఈ నెల 29 న ముంబైలోని వాఖండే స్టేడియంలో ముంబై ఇండియన్స్ అలాగే చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మొదటి మ్యాచ్ జరగనుంది. అయితే చూడాలి మరి ఏం జరుగుతుందో.