ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తహసీల్దార్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్‌ ధర్నా

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 07, 2020, 12:31 PM

: టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎంపీ రేవంత్‌రెడ్డి అరెస్టుకు నిరసనగా మండల కేంద్రంలోని తహసీల్‌ కార్యాలయం ఎదుట కాంగ్రెస్‌ మండల శాఖ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షుడు దొమ్మటి నర్సయ్య ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి రేవంత్‌రెడ్డిని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వం అపహస్యం చేస్తుందని ఆరోపించారు. అనంతరం డిప్యూటి తహసీల్దార్‌ జయంత్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈకార్యక్రమంలో ఎంపీటీసీ పద్మ, నాయకులు దేవయ్య, లక్ష్మారెడ్డి, గౌస్‌పాషా, బుచ్చాగౌడ్‌, నాగరాజు, రాంరెడ్డి, పందిలర్ల లింగంగౌడ్‌, రాజునాయక్‌లు పాల్గొన్నారు.


 


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com