తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఈరోజు సాయంత్రం జరగనుంది. ప్రస్తుతం రాష్ట్రం లో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. నిన్న ఉభయసభల నుద్దేశించి గవర్నర్ ప్రసంగం కూడా పూర్తయిన విషయం తెలిసిందే. దీంతో ఈ రోజు జరిగే కేబినెట్ సమావేశంలో రాష్ట్ర బడ్జెట్ కు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. అలాగే బడ్జెట్ పై చర్చ సందర్భంగా అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహం పైనా మంత్రి మండలి చర్చిస్తుంది.