అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం వివిధ రంగాల్లో ప్రతిభ చాటిన మహిళలకు అవార్డులను ప్రకటించింది. ప్రముఖ గాయనీ, ఫోక్ సింగర్‌గా గుర్తింపు తెచ్చుకున్న మంగ్లీ ( సత్యవతికి ) అవార్డు లభించింది. ఫోక్ సింగర్ విభాగంలో ఆమెను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు వెల్లడించారు. మార్చి 8వ తేదీన మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరగబోయే వేడుకల్లో వీటిని ప్రధానం చేయనున్నారు.
మంగ్లీ తన పాటలతో తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది అభిమానులను సంపాధించుకున్నారు. అనేక అంశాలపై పాటలు కూడా పాడి తన ప్రతిభను చాటుకున్నారు. దీనికి గుర్తింపుగా ఈ ఏడాది మహిళా దినోత్సవం సందర్భంగా అవార్డు లభించింది. ఆమెతో పాటు సాంస్కృతికం, క్రీడలు, సామాజిక సేవ తదితర రంగాల్లో సత్తా చాటిన అతివలకు కూడా అవార్డుకు ఎంపిక చేశారు. వీరిలో మొదటి మహిళా పైలెట్‌గా ఎంపికైన సయ్యద్ సల్వా ఫాతిమ,అగ్రికల్చర్ విభాగంలో బేగారి లక్ష్మమ్మ, గ్రామీణ ప్రాంత నేపథ్యంలో సోషల్ మీడియాలో నటించినందుకు మిల్కూరి గంగవ్వ సహ పలువురికి ఈ అవార్డులను అందించనున్నారు. ఈ అవార్డుకు ఎంపికైనందుకు మంగ్లీ సంతోషం వ్యక్తం చేశారు.