శాసనసభ నుంచి కాంగ్రెస్ సభ్యులు సస్పెన్షన్‌కు గురయ్యారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై శాసనసభలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తుండగా కాంగ్రెస్ సభ్యులు అడ్డుతగిలారు. దీంతో ఆరుగురు కాంగ్రెస్ సభ్యులను స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఒక రోజు సస్పెండ్ చేశారు. రాజగోపాల్‌రెడ్డి, సీతక్క, భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, వీరయ్య, జగ్గారెడ్డిలను స్పీకర్ సస్పెండ్ చేశారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని కాంగ్రెస్ సభ్యులను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, సీఎం కేసీఆర్ లు కోరినా.. కాంగ్రెస్ సభ్యులు ఏ మాత్రం పట్టించుకోలేదు. దీంతో కాంగ్రెస్ సభ్యులను సస్పెండ్ చేయాలని సీఎం కోరగా, సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సస్పెన్షన్ తీర్మానాన్ని పెట్టారు.