తెలంగాణ రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు శాసన మండలిలో చేదు అనుభవం ఎదురైంది. మంత్రి పువ్వాడ మండలికి వెళుతుండగా మార్షల్స్ అడ్డుకున్నారు. తాను మంత్రినని చెప్పిన తర్వాత మార్షల్స్ పువ్వాడను మండలిలోకి అనుమతించారు. మార్షల్స్ తీరు పై మంత్రి పువ్వాడ అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ దృష్టికి తీసుకెళ్లినట్టు ఆయన తెలిపారు.