ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారులకు ఆదేశాలు జారీ...

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 07, 2020, 06:04 PM

కరోనా వైరస్ వ్యాప్తి నివారించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. జిల్లాల్లో కూడా అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్ ఉండేలా చూడాలన్నారు. శనివారం సచివాలయం నుంచి జిల్లాల డీఎంహెచ్ వోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరీంనగర్ కు గ్రానైట్ వ్యాపారం కోసం వచ్చిన చైనా , ఉజ్బెకిస్తాన్ వారిని గుర్తించి క్వారంటైన్ లో ఉంచినట్లు కరీంనగర్ జిల్లా వైద్య అధికారి తెలిపారు. అదే విధంగా అన్ని జిల్లాలకు వచ్చిన వారి వివరాలు సేకరించి ఇసొలేషన్ లో ఉంచాలని సూచించారు. భయం పోగొట్టేందుకు సెక్రెటరి స్థాయి నుంచి ఆశావర్కర్ వరకు అందరూ పని చేయాలని తెలిపారు. దీనికి జిల్లాల్లో జిల్లా వైద్య అధికారులు భాద్యత వహించాలన్నారు. సిబ్బంది, డాక్టర్స్ సమయపాలన , విధులు సరిగా నిర్వహించక పోయినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. వచ్చే మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రతి గ్రామంలో ఉన్న స్కూల్ లో ఆశా వర్కర్స్, వైద్య సిబ్బంది కోవిడ్-19 అవగాహన కార్యక్రమం నిర్వహించాలని మంత్రి సూచించారు. కరోనా వైరస్ పై యుద్దం చేద్దామన్నారు. అవగాహన కల్పిస్తే విజయం మనదే అన్నారు. వైరస్ కేసులు నమోదు కాలేదు అని రిలాక్స్ అవ్వొద్దని మంత్రి సూచించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com