నిర్మల్ మండలంలోని ముజిగి గ్రామానికి చెందిన తోట మహిపాల్ అనే వ్యక్తి గత 15 రోజుల క్రితం దుబాయ్ నుండి ముజిగి గ్రామానికి రావడం జరిగింది అయితే ఇతను గత నాలుగు రోజుల నుండి జలుబు దగ్గు తగ్గడం లేదని ముజిగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి డాక్టర్ రాజేందర్ గారికి చూపించగా, ఆయన కరోనా వైరస్ కు సంబంధించిన లక్షణాలు ఉన్నాయని చెప్పారు.ఈ రోజు ఉదయం నిర్మల్ ఏరియా హాస్పిటల్ కు రిఫర్ చేయడం జరిగింది మధ్యాహ్నం 12:00 గంటలకు గంటలకు ఏరియా హాస్పిటల్ లో మహిపాల్ ను డాక్టర్లు పరిశీలించి ఐసొల్యూషన్ వార్డులో ఉంచి ఆ పేషెంట్ ను గాంధీ హాస్పిటల్ కు రిపేర్ చేయడానికి హాస్పిటల్ సూపర్డెంట్ సిద్ధం చేశారు.ఈ క్రమంలో సదరు పేషెంట్ హాస్పిటల్ నుంచి బయటికి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ మహిపాల్ అనే పేషెంట్ ఎక్కడున్నాడో జాడ తెలియడం లేదు. దీంతో తో స్థానికులు ఆందోళన చెందుతున్నారు