శేర్ లింగంపల్లి , జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని షేక్ పేట, దర్గా,గచ్చిబౌలి, బొటానికల్ గార్డెన్, మజీద్ బండ తదితర ప్రాంతాలలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ ను నివారించేందుకు చేపట్టిన చర్యల్లో భాగంగా. నగర మేయర్ బోంతు రామ్మోహన్ పర్యటించారు. ఫ్లై ఓవర్ల నిర్మాణాలను పరిశీలించడంతో పాటు రోడ్ల విస్తరణకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో శాసన సభ్యులు అరికపూడి గాంధీ ,మాగంటి గోపీనాథ్ , కార్పొరేటర్లు కొమిరిశెట్టి సాయిబాబా, రాగం నాగేందర్ యాదవ్ తో పాటు జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు.