రంగారెడ్డి జిల్లాలోని ఆసరా పింఛను దారులకు ఇబ్బందులు తప్పడం లేదు. కొంత మందికి వెలు ముద్రలు పని చేయవు , పలు గ్రామాలలో సిగ్నల్ ఉండదు. కొన్ని గ్రామాల్లో వృద్దులు నడవ లేని స్థితిలో ఉన్న వారి ఇంటి దగ్గరకు వెళ్లి ఇవ్వాలని ప్రభుత్వం చెప్పిన అధికారులు పట్టించుకోవడం లేదు. కొన్ని గ్రామాల్లో వృద్ధులు, వితంతువులకు ప్రభుత్వం రూ. 2016, వికలాంగులకు 3016 అందజేయాలని ప్రభుత్వం చెప్పినా తపాలా శాఖ సిబ్బంది చిల్లర డబ్బలు లేవని చెబుతూ 2వేలు, 3వేలు ఇస్తూ మిగిలిన డబ్బులు వారే ఉంచుకుంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పట్టించుకోని ఆసరా పింఛను దారులకు న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు.