హైదరాబాద్: తెలంగాణ వార్షిక బడ్జెట్‌ను కాసేపట్లో రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు శాసనసభలో, రహదారులు భవనాలశాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి శాసనమండలిలో ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డిని కలిసి బడ్జెట్ ప్రతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, ఆర్థికశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.