హైదరాబాద్: తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు మూడోరోజు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ఆర్థిక మంత్రి టి.హరీశ్‌రావు 2020-21 వార్షిక బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆర్థిక మాంద్యం ప్రభావం రాష్ట్రంపై పడిందని వివరించారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటా బడ్జెట్లో వేసుకున్న అంచనాల కంటే రూ.3,731 కోట్లు తగ్గిందని వెల్లడించారు.