తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు మూడోరోజు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ఆర్థిక మంత్రి టి.హరీశ్‌రావు 2020-21 వార్షిక బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ పగతిశీల రాష్ట్రంగా రూపుదిద్దుకుంటుంది. బడ్జెట్ ప్రవేశ పెట్టె అవకాశం లభించడం నా అదృష్టం అని అయన అన్నారు. గతేడాది రెవెన్యూ వృద్ధిరేటు 16 నుంచి 6 శాతానికి తగ్గింది. ప్రతికూల పరిస్థితుల్లో సరైన వ్యూహాలు రూపొందిస్తున్నాం. గతేడాది బడ్జెట్ లో లక్షా 36వేలు ఖర్చు చేశాం అని అన్నారు. రాష్ట్ర జీఎస్డీపీ 12. 6 శాతానికి తగ్గింది.