రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రైతు బంధు పథకానికి తెలంగాణ బడ్జెట్ల పెద్దపీట వేశారు. 14వేల కోట్ల రూపాయాలను రైతుబంధు పథకానికి నిధులు కేటాయించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా రుణమాఫీపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.25 వేల లోపు బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న రైతులకు ఒకేసారి ఈ నెలలోనే రుణమాఫీ చేయనున్నట్లు హారీష్ తెలిపారు. రైతులకు వ్యక్తిగతంగా చెక్కుల ద్వారా పంపిణీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. 25 వేల నుంచి లక్ష లోపు రుణాలు తీసుకున్న రైతులకు నాలుగు దఫాల్లో రైతులకు చెక్కులు అందించనున్నారు. ఈ చెక్కులను ఎమ్మెల్యేలు పంపిణీ చేశారు.