తెలంగాణ బడ్జెట్లో రైతులతో పాటు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. రైతుబంధు పథకానికి 14 వేల కోట్ల రూపాయాలను కేటాయించింది. సాగునీటి పారుదల రంగానికి 11 వేల 54 కోట్ల రూపాయాలను కేటాయించారు. అన్ని రకాల పెన్షన్ల కోసం 11 వేల 7 వందల 58 కోట్లను కేటాయించింది. కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ కోసం 350 కోట్లను బడ్జెట్లో కేటాయించారు. మత్స్యకారుల కోసం 15 వందల 86 కోట్ల కేటాయించారు. మైనారిటీల కోసం 15 వందల 18 కోట్లను కేటాయించారు. షెడ్యూల్ కులాల కోసం 4 వేల 3 వందల 56 కోట్ల కేటయింపులు చేశారు. ఎంబీసీ కోసం 500 కోట్ల కేటాయింపులు జరిగాయి.