రాష్ట్ర తలసరి ఆదాయం దేశం కన్నా ఎక్కువ అని మంత్రి హరీష్ రావు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి టి.హరీశ్‌రావు 2020-21 వార్షిక బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతుల కోసం చేపట్టిన పలు పథకాలు వారి అభివృద్ధికి కృషి చేస్తున్నామని అన్నారు. రైతు బంధు పథకాన్ని ఎన్నో రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. కేంద్రం కూడా ఈ పథకాన్ని అమలు చేస్తోంది. రైతుబంధు పథకానికి 12 వేల కోట్లు కేటాయించాము ఈ సంవత్సరం లబ్ధిదారుల సంఖ్య పెరుగుతుంది. రైతు బీమాకు రూ. 1,141 కోట్లు కేటాయించామని అయన తెలిపారు. రైతు భీమా కింద 5 లక్షలు ఇస్తున్నాం అని అన్నారు.