తన అన్న మారుతీరావుతో ఎలాంటి విభేదాలు లేవని ఆయన తమ్ముడు శ్రవణ్ తెలిపారు. తన వల్లే మారుతీరావు చనిపోయారన్నది అవాస్తమన్నారు. గత ఏప్రిల్ నుంచి తన అన్నతో మాటలు లేవని ఆయన అన్నారు. తన అన్నకు తనకు మధ్య ఎలాంటి ఆస్తి వివాదాలు లేవని శ్రవణ్ తెలిపారు. ప్రణయ్ హత్య కేసులో ఎలాంటి సంబంధం లేకున్నా కానీ తాను జైలు జీవితం అనుభవించానన్నారు. కేసు ట్రయల్ దశకు వచ్చినందు వల్లే ఒత్తిడికి గురై మారుతీరావు ఆత్మహత్య చేసుకోవచ్చని శ్రవణ్ అన్నారు. తన అన్న ఆత్మహత్య విషయం తెలుసుకుని ఆస్పత్రికి వెళ్లానన్నారు.