ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘జూన్‌ 1:43‘ టీజర్‌ విడుదల

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, May 16, 2017, 02:13 AM

ఆదిత్య, రిచా హీరో హీరోయిన్లుగా ఆదిత్య క్రియేషన్స్‌ బ్యానర్‌పై భాస్కర్‌ బంటుపల్లి దర్శకత్వంలో లక్ష్మి నిర్మిస్తున్న చిత్రం ‘జూన్‌ 1:43‘. ఈ సినిమా టీజర్‌ విడుదల కార్యక్రమం ఆదివారం హైద్రాబాద్‌ రామానాయుడు స్టూడియోలో జరిగింది. నిర్మాత లక్ష్మి టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ.. ‘నాకు సినిమాల గురించి పెద్దగా తెలియవు. అయితే భాస్కర్‌ చెప్పిన కథ నచ్చడంతో సినిమా చేయడానికి సిద్దమయ్యారు. భాస్కర్‌గారు సినిమాను ఎంతో చక్కగా తెరకెక్కించారు. ఆదిత్య, రిచా అందరూ చక్కగా నటించారు. మల్హర్‌ భట్‌ జోషిగారు, శ్రవణ్‌ సహా టెక్నీషియన్స్‌ ఎంతో సపోర్ట్‌‌ట చేయడంతో సినిమాను అనుకున్న సమయంలో పూర్తి చేశాం. జూన్‌ 1ః43 అన్నట్లుగానే సినిమాను జూన్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు.


ఆదిత్య మాట్లాడుతూ.. ‘ఈ చిత్రంలో మంచి రోల్‌ చేశాను. భాస్కర్‌గారు సినిమాను ఆద్యం తం ఎంతో చక్కగా తెరకెక్కించారు. నటీనటులు, టెక్నీషియన్స్‌ అందించిన సహకారంతో సినిమాను పూర్తి చేయగలిగాం. సినిమా తప్పకుండా అందరికీ నచ్చేలా ఉంటుంది‘ అన్నారు.దర్శకుడు భాస్కర్‌ బంటుపల్ల్లి మాట్లాడుతూ.. లక్ష్మిగారు అందించిన సపోర్‌‌‌‌ట్టతోనే సినిమాను చేయగలిగాను. నేను షార్ట్‌ ఫిలిం దర్శకుడిని అయిన తర్వాత వేణుగారు లక్ష్మిగారికి పరిచయం చేశారు. అందరం కష్టంతో ఇష్టపడి చేసిన ఈ సినిమాను టైటిల్‌కు తగ్గట్టుగానే జూన్‌లోనే విడుదల చేయాలని అనుకుంటున్నాం‘ అన్నారు.


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com