ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గురుకుల కాలేజీల్లో ఇంటర్ అడ్మిషన్స్... 2 రోజులే గడువు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 08, 2020, 07:56 PM

తెలంగాణలోని గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్‌లో చేరాలనుకునే టెన్త్ విద్యార్థులకు శుభవార్త. కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ గడువును పెంచింది తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ-TREIS.తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ జూనియస్ కాలేజెస్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్-TSRJC CET 2020 పేరుతో ఈ పరీక్ష జరగనుంది. వాస్తవానికి ఈ ఎగ్జామ్ మే 10న జరగాల్సి ఉండగా కరోనా వైరస్ సంక్షోభం కారణంగా వాయిదా పడింది. పరీక్ష వాయిదా వేయడంతో దరఖాస్తు చేయాలనుకునే విద్యార్థులకు మరో అవకాశం ఇస్తోంది సొసైటీ. ఆసక్తి గల విద్యార్థులు జూలై 10 వరకు అప్లై చేయొచ్చు. ఆ తర్వాత ఎంట్రెన్స్ టెస్ట్ తేదీని ప్రకటించనుంది TREIS.తెలంగాణలోని 35 రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ ఫస్ట్ ఇయర్‌లో ప్రవేశాల కోసం TSRJC CET 2020 జరగనుంది. వీటిలో 20 బాలికల కళాశాలలు కాగా, 15 బాయ్స్ కాలేజీలు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను tsrjdc.cgg.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఏవైనా సందేహాలు ఉంటే 040-24734899 లేదా 9490967222 నెంబర్లను సంప్రదించొచ్చు.


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com