బంగారం ధర నేడు స్వల్పంగా దిగొచ్చింది. హైదరాబాద్ మార్కెట్లో గురువారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.70 తగ్గింది. దీంతో ధర రూ.53,950కు పడిపోయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.70 తగ్గింది. దీంతో ధర రూ.49,450కు చేరింది. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.500 పడిపోయింది. దీంతో వెండి ధర రూ.69,000కు దిగొచ్చింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. విజయవాడ,విశాఖలో కూడా ఇవే ధరలున్నాయి.