హైదరాబాద్ నేరేడ్ మెట్ కాకతీయ నగర్ కు చెందిన బాలకృష్ణకు 24 ఏళ్లు. ఆయన కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తున్నాడు. బాలకృష్ణకు ఇందిరా నెహ్రూ నగర్ కు చెందిన సంఘెం రజితతో వివాహం జరిగింది. పెళ్లైన కొద్ది రోజులు ఈ జంట బాగానే ఉంది. ఆ తర్వాత తరచూ గొడవలు జరిగేవి. దీంతో బాలకృష్ణ మొదటి భార్యకు తెలియకుండా రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇటీవల విషయం తెలిసిన రజిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు బాలకృష్ణను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.