తెలంగాణ సీఎం సహాయ నిధికి పాతిక లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించాడు ఎనర్జిటిక్ హీరో రామ్. ప్రకటించినట్టుగానే ఆ మొత్తాన్ని సీఎం సహాయ నిధికి అందించాడు. ఈ రోజు (గురువారం) తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ను కలిసి ఆ చెక్కును అందించాడు. భారీ వర్షాలు, వరదలతో హైదరాబాద్ నగరం అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ఎన్నో ఇక్కట్లు ఎదుర్కొంటున్న భాగ్యనగర వాసులను ఆదుకునేందుకు పలువురు సినీ ప్రముఖులు ముందుకొచ్చారు. యంగ్ హీరో రామ్ కూడా తన వంతు సహాయం చేసేందుకు ముందుకొచ్చాడు.