కేసీఆర్ పుట్టక గురించి షర్మిల అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ..నాడు నై తెలంగాణ అన్న షర్మిల ఇప్పుడు జై తెలంగాణ అంటే ఎవరూ నమ్మబోరన్నారు. తెలంగాణ కోసం మద్దతుగా షర్మిల ఏనాడైనా మాట్లాడారా అని ప్రశ్నించారు. అయితే ప్రతిపక్షంలో ఎవరున్నా తమకు ఇబ్బందిలేదన్న జీవన్‌రెడ్డి, షర్మిలను మాత్రం ఆడబిడ్డగా, తెలంగాణ కోడలిగానే చూస్తామన్నారు.