ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాగ‌ల రెండు రోజుల‌పాటు గ్రేటర్ హైద‌రాబాద్‌లో వర్షం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, May 05, 2021, 08:20 AM

గ‌్రేట‌ర్ హైద‌రాబాద్‌లో రెండు రోజుల పాటు వాన‌లు కురవ‌నున్నాయి. ఉపరితల ద్రోణి పశ్చిమ విదర్భ నుంచి ఉత్తర ఇంటీరియర్‌ కర్ణాటక మీదుగా కేరళ వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తు వరకు వ్యాపించి ఉందని, ఈ ప్రభావంతో రాగల రెండు రోజుల పాటు గ్రేటర్‌కు వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.గ్రేటర్‌లో మంగళవారం మధ్యాహ్నం పలు ప్రాంతాలలో ఓ మోస్తారు నుంచి తేలికపాటి జల్లులు కురిసాయి. ఉదయం ఎండ తీవ్రత ఉండగా, మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఆకాశం మేఘావృతమై వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఈ క్రమంలోనే కొన్ని నిమిషాల పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి. కుత్బుల్లాపూర్‌, చందానగర్‌, కూకట్‌పల్లి, యూసుఫ్‌గూడ, ఖైరతాబాద్‌, బేగంపేట, ఎర్రగడ్డ, కంటోన్మెంట్‌, జూబ్లీహిల్స్‌, మెహిదీపట్నం, కార్వాన్‌, మలక్‌పేట, ఫలక్‌నుమా, బషీర్‌బాగ్‌, చంపాపేట, సరూర్‌నగర్‌, అల్వాల్‌, తిరుమలగిరి తదితర ప్రాంతాల్లో ఓ మోస్తారు వర్షం కురిసింది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com