హైదరాబాద్ హబీబ్ నగర్ పీఎస్ పరిధిలో రౌడీ షీటర్ హల్చల్ సృష్టించాడు. వివరాల్లోకి వెళ్తే హబీబ్ నగర్ చెందిన సమీర్ అనే రౌడీ షీటర్ తన అనుచరుడిని ఒక మొబైల్ షాప్ కి పంపి తన పేరు చెప్పి మొబైల్ తీసుకు రమ్మన్నాడు. మొబైల్ ఇవ్వడానికి నిరాకరించిన యజమానిని రౌడీ షీటర్ సమీర్ తన అనుచరులతో కలిసి మొబైల్ షాపుపై దాడి చేశాడు. అనంతరం షాపు యజమానిపై, అడ్డువచ్చిన వారిపై దాడి చేశారు. స్థానికులు సమాచారం మేరకు వెంటనే ఘటన స్థలానికి వచ్చిన పోలీసులు బాధితులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.