మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పశుసంవర్థక శాఖకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చారని అన్నారు. శనివారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో అన్ని జిల్లాల పశువైద్యాధికారులు, పశుసంవర్థక అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలన్నద్దే సీఎం కేసీఆర్ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీతో రూ.6500 కోట్ల సంపద సృష్టించబడిందని వెల్లడించారు. 2వ విడత గొర్రెల పంపిణీ కోసం ప్రభుత్వం రూ. 6 వేల కోట్లు విడుదల చేసిందని తెలిపారు. పెరిగిన ధరలను దృష్టిలో ఉంచుకొని గొర్రెల యూనిట్ ధరను 1.25 లక్షల రూపాయల నుంచి 1.75 లక్షలకు పెంచినట్లు మంత్రి గుర్తుచేశారు. రాష్ట్రంలో పశుగ్రాసానికి కొరత లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందన్నారు.