ట్రెండింగ్
Epaper    English    தமிழ்

38వేల కోట్ల సబ్ ప్లాన్ నిధులు ఎక్కడ పోయాయి : గీతారెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 31, 2021, 04:53 PM

కేసీఆర్ దళితులను దగా చేస్తున్నారని మాజీమంత్రి గీతారెడ్డి అన్నారు. గీతారెడ్డి  మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ దళితులకు చెప్పింది ఏది చేయకుండా మోసం చేశారని మండిపడ్డారు. దళిత సీఎం హామీ ఇచ్చి మాట తప్పారన్నారు. దళిత డిప్యూటీ సీఎంను ఎందుకు బర్తరఫ్ చేశారో చెప్పలేదని ప్రశ్నించారు. దళితులందరికీ మూడెకరాల భూమి ఇవ్వలేదన్నారు. 38వేల కోట్ల సబ్ ప్లాన్ నిధులు ఎక్కడ పోయాయో ఎవ్వరికీ తెలీదన్నారు. 125అడుగుల అంబేద్కర్ విగ్రహం పెట్టలేదన్నారు. దళితులకు బడ్జెట్‌లో కేటాయించిన నిధులే పూర్తిగా ఖర్చు చేయని కేసీఆర్ లక్షల కోట్లు పెడుతా అంటే ఎలా నమ్మాలి? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడైనా అంబేద్కర్‌కు పూలమాల వేశారా? అని గీతారెడ్డి నిలదీశారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com