ఆపిల్ ఆంగ్లం (రోసేసి) కుటుంబానికి చెందింది. దీనిని తెలుగులో సీమ రేగి పండు అంటారు. ఇది పోమ్ రకానికి టెందింది. ఆపిల్ (Molus domestrica) జాతి చెట్ల నుండి లభిస్తుంది. విస్తృతంగా సేద్యం చేయబడుతున్న పండ్ల చెట్లలో ఒకటి. ఇది మానవులు ఎక్కువగా తినడానికి ఇష్టపడుతారు. ఆపిల్ చెట్లు చిన్న ఆకురాల్చే చెట్లు. వసంతకాలంలో పూసి చలికాలంలో పండ్లనిస్తాయి. ఇవి పశ్చిమ ఆసియాలో జన్మించాయి. ఆసియా, యూరప్ దేశాలలో కొన్ని వేల సంవత్సరాలుగా పెంచబడుతున్నది. ఆపిల్ పండ్లలో 7,500లకు పైగా రకాలు వివిధ లక్షణాలు కలవిగా గుర్తించారు.కొన్ని తినడానికి రుచికోసం అయితే మరికొన్ని పంట కోసం ఉపయోగిస్తారు. వీటిని సామాన్యంగా అంటుకట్టి వర్థనం చేస్తారు. ఇవి చాలా రకాల శిలీంధ్రాలను, బాక్టీరియా చీడలను లోనై ఉంటుంది. అనేక పోషకాలు ఈ పండులో ఉన్నాయి. మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల పండ్లలో కంటే ఎక్కువ పోషకాలు యాపిల్ లోనే ఉన్నాయి. అందుకనే రోజూ ఒక యాపిల్ పండును తింటే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరం రాదని నిపుణులు చెబుతున్నారు. యాపిల్ పండ్లను తినడం వలన పలు అనారోగ్య సమస్యలకు స్వస్తి చెప్పవచ్చు. ముఖ్యంగా నుమోనియా వ్యాధి రాకుండా యాపిలే చేయగలదని ఆరోగ్య నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. యాపిల్ పండ్లలో ఉండే విటమిన్ సి న్యుమోనియో రాకుండా చూస్తుందని నిపుణులు చెబుతున్నారు. నిత్యం యాపిల్ పండ్లను తినడం వల్ల ఈ వ్యాధి నుంచి రక్షణ పొందవచ్చు. అలాగే రోజుకో గ్రీన్ యాపిల్ తినడం వల్ల కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు. గ్రీన్ యాపిల్‌లో ఉండే యాంటీ యాక్సిడెంట్ కాలేయాన్ని రక్షిస్తాయి. శరీరంలోని థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేయడానికి ఒక యాపిల్ పండు చేస్తుంది. చేతులు వణకడం, జ్ఞాపక శక్తి మందగించడం వంటి అనేక ఆరోగ్య సమస్యలను గ్రీన్ యాపిల్‌తో చెక్ పెట్టవచ్చు అంటున్నారు వైద్యులు. ప్రతి రోజు యాపిల్ తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. చర్మ సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంగి. ఊబకాయం, తలనొప్పి, కీళ్లనొప్పి, ఆస్తమా, అనీమియా, క్షయ, నాడీ సమస్యలు, నిద్రలేమి, జలుబు వంటి పలు రకాల సమస్యకు ఆపిల్ చక్కని ఔషదంగా పనిచేస్తుంది.