పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆగష్టు 9న దళిత, గిరిజన హక్కుల కోసం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి నుంచి సమరశంఖం పూరించనున్నట్లు వెల్లడించారు. దళిత బంధు అమలు చేయకపోతే టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్ల ముందు చావు డప్పు కొడతామని హెచ్చరించారు. కాంగ్రెస్ హయాంలో దళిత, గిరిజనులకు భూములు ఇస్తే కేసీఆర్ సర్కార్ ఆ భూములను లాక్కుంటుందని మండిపడ్డారు. సచివాలయం, ప్రగతిభవన్ అమ్మైనా దళితులందరికీ దళిత బంధు అందించలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. వచ్చే అసెంబ్లీలో దళిత బంధుపై ఏకగ్రీవ తీర్మానం చేయాలన్నారు.