సికింద్రాబాద్ జెమ్స్ స్ట్రీట్ సస్టేషన్ పరిధిలో తలెత్తిన సాంకేతిక లోపాల కారణంగా ఆదివారం వివిధ ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని ప్యారడైజ్ ఏడీఈ అధికారులు తెలిపారు. సీటీసీ కాంప్లెక్స్ ఫీడర్ పరిధిలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 11 వరకు చంద్రలోక్ కాంప్లెక్స్ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, ఎమరాల్డ్ హౌస్, నాన్ కింగ్ బార్, భారత్ పెట్రోలియం ప్రాంతాలు, చికోటి కాంప్లెక్స్ పరిధిలో 11. 30 గంటల నుంచి 12. 30 వరకు గాంధీ నగర్ పీఎస్ పరిధి బోయిగూడ గార్డెన్ పరిధి సున్నం, రైల్వే క్వార్టర్స్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఏరియాలు, అలాగే సరోజినిదేవి ఫీడర్ పరిధిలో మధ్యాహ్నం 12. 30 గంటల నుంచి సాయంత్రం 1. 30 వరకు స్వప్నలోక్ కాంప్లెక్స్, 1, 2 ప్రాంతాలు, యాత్రినివాస్ ఫీడర్ పరిధిలో ఉదయం 2. 30 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు యాత్రినివాస్ ప్రాంతాలు, మహాత్మాగాంధీ ఫీడర్ పరిధిలోని మధ్యాహ్నం 3. 30 గంటల నుంచి సాయంత్రం 4. 30 గంటల వరకు గాంధీ విగ్రహం, ఇష్క కాంప్లెక్స్, కంచుబొమ్మ, సుభాష రోడ్డు ప్రాంతాలు, పీజీ రోడ్డు ఫీడర్ పరిధిలో సాయంత్రం 4. 30 గంటల నుంచి 6. 30 వరకు వెస్లీ కాలేజ్, జవహార్ నగర్, పార్శి కాంపౌండ్, కరీం కాంపౌండ్ ప్రాంతాల్లో విద్యుత్ పరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు.